![]() |
![]() |

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(MOhanlal)పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)కాంబోలో తెరకెక్కిన 'ఎల్ 2 ఎంపురాన్'(L2 Empuraan)మార్చి 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీకి ఎంత బడ్జెట్ ఖర్చయిందనే విషయాన్నీ చిత్ర నిర్మాతలు ఎక్కడా వెల్లడి చెయ్యలేదు.
కానీ ఇప్పుడు రీసెంట్ గా ఎంపురాన్ బడ్జెట్ ని నిర్మాతలు అధికారకంగా వెల్లడి చేసారు. మలయాళ సినీ ఇండస్ట్రీ లోనే ఫస్ట్ టైం 175 కోట్ల బడ్జెట్ తో రూపొందినట్టు చెప్పుకొచ్చారు. మలయాళ చిత్ర సీమలో మార్చి నెలలో పదిహేను సినిమాలు విడుదలవ్వగా ఎంపురాన్ మాత్రమే విజయాన్ని సాధించిందని, వసూళ్ల పరంగాను 262 కోట్ల రూపాయలకి పైగా కలెక్ట్ చేసి మలయాళ చిత్ర సీమలోనే హయ్యస్ట్ గ్రాసర్ సాధించిన మూవీగా కూడా నిలిచిందని చెప్పారు. కేరళ చలన చిత్ర నిర్మాతల సంఘం కూడా ఈ విషయాన్నీ వెల్లడి చేసింది.
లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కిన ఎల్ 2 ఎంపురాన్ ని గోకులం గోపాలన్, ఆంథోనీ పెరంబవూర్, సుభాస్కరన్ నిర్మించారు. మంజు వారియర్, అభిమన్యు సింగ్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించగా దీపక్ దేవ్ సంగీతాన్ని అందించాడు. పృథ్వీ రాజ్ సుకుమారన్ దర్శకత్వంతో పాటు ఒక కీలక పాత్ర చెయ్యగా, ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి వేదికగా జియో హాట్ స్టార్(Jio Hot star)లో స్ట్రీమింగ్ అవుతుంది.
![]() |
![]() |